శరీరంలోని రోగాల గురించి చెప్పేస్తున్న నాలుక.. క్యాన్సర్‌ను కూడా పసిగట్టవచ్చు!

by Javid Pasha |
శరీరంలోని రోగాల గురించి చెప్పేస్తున్న నాలుక.. క్యాన్సర్‌ను కూడా పసిగట్టవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలో నాలుక చాలా ముఖ్యమైందనే విషయం తెలిసిందే. అయితే ఇది మాట్లాడటానికి, ఆహారం రుచి తెలియడానికి మాత్రమే కాదు. ఆరోగ్యం విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్తే నాలుక చూపించాలని అడుగుతుంటారు. అంటే నాలుక రంగు, దానిపై ఏర్పడే మచ్చలు, వివిధ మార్పులు వంటి లక్షణాలను బట్టి శరీరంలో క్యాన్సర్ సహా, వివిధ రోగాల విషయంలో ఒక నిర్ధారణకు రావచ్చునని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

తెల్లటి మచ్చలు

నాలుకపై తెల్లటి మచ్చలు కనిపించడం లేదా పూర్తిగా మారడం, ఏదో క్రీమ్ వంటి పదార్థం ఉత్పత్తి అవుతుండటం వంటివి అనుమానించ దగినవి. ఎందుకంటే ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వారిలోనూ సంభవిస్తాయి. అలాగే క్రీమీ నాలుక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా సంభవించవ్చు. ఇది తీవ్రంగా మారితే ల్యుకోప్లాకియా వ్యాధికి దారితీస్తుంది. క్రమంగా ఇది క్యాన్సర్ గా మారుతుంది.

వెంట్రుకల, చర్మపు ముళ్లు

నాలుక మీద చిన్నగా ఓ వరుస క్రమంలో వెట్రుకలు పెరిగడం, చర్మపు ముళ్లు పెరగడం వంటివి ప్రమాదకరమైన హెచ్చరిక. ఇటువంటి లక్షణాలతోపాటు తెలుపు, నలుపు లేదా గోధుమ రంగులోకి మారితే ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగిందని చెప్పవచ్చు. అలాగే ఇది హానికరమైన బ్యాక్టీరియా వల్ల కూడా జరుగుతుంది. క్రమంగా క్యాన్సర్ కారకం కావచ్చు.

నాలుక ఎర్రగా మారడం

నాలుక రోజుల తరబడి సాధారణం కంటే ఎర్రగా మారడం లేదా పింక్ నుంచి స్కార్లెట్‌కి మారితే గనుక. ప్రమాద సంకేతంగా భావించాలి. ఎందుకంటే ఇది కవాసకి వ్యాధికి సంబంధించిన లక్షణం కూడాను. దాంతోపాటు విటమిన్ల లోపం, పిల్లల్లో స్కార్లెట్ జ్వరం వల్ల కూడా నాలుక ఎర్రగా మారవచ్చు. పెద్దల్లో దీర్ఘకాలం ఎరుపు రంగు కనిపిస్తే క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి.

క్రమంగా నల్లబడటం

నాలుక నల్లబడటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎవరిలోనైనా అలా మారుతోందంటే, వారు డయాబెటిస్ పేషెంట్లు అయి ఉంటే గనుక వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది కామన్‌గా యాంటాసిడ్ మాత్రలు తీసుకున్న తర్వాత జరుగుతుంది. కానీ సాధారణ వ్యక్తులకు ఇలా జరిగితే ఆందోళన కలిగించే విషయమే. యాంటాసిడ్ లేకుండా నాలుక నల్లగా మారుతున్నట్లయితే డాక్టర్లను సంప్రదించాలి.

గాయం తగ్గకపోవడం

నాలుకపై ఏదైనా గాయం అయినట్లు కనిపించడం, తినడానికి ఇబ్బందిగా మారడం, చాలా రోజులు అయినప్పటికీ తగ్గకపోవడం అనేది ప్రమాద సంకేతం. సాధారణంగా మందులతో కూడా అది నయం కావడం లేదంటే క్యాన్సర్ వచ్చిందని అనుమానించ్చు.

పగుళ్లు - మంట

నాలుకపై పగుళ్లు ఏర్పడటం, మంట పుట్టడం వంటివి కూడా ఏదో ఒక వ్యాధికి సంకేతమని నిపుణులు చెప్తున్నారు. సాధారనంగా ఎసిడిటీవల్ల, నరాల రుగ్మతవల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు ఈ సమస్యతో బాధపడుతుంటే సోరియాసిస్ సిండ్రోమ్ లక్షణం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులకు దారితీస్తుంది.

Next Story