‘కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్’

by GSrikanth |
‘కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్’
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడని విమర్శించారు. వ్యవసాయ శాఖపై కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎమ్‌ఎస్‌పీని కేంద్రం నిర్ణయిస్తుందనే కనీస అవగాహన కూడా లేదని సెటైర్లు వేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కులగొట్టలేరని, ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ ఎప్పుడూ ప్రొత్సాహించదు అని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడి మర్డర్‌పై కాంగ్రెస్ నేతలపై దుష్ప్రచారం చేయడం తగదు అని అన్నారు.

Next Story