ప్రజ్వల్‌కు విదేశాంగ శాఖ షోకాజ్ నోటీసులు

by Shamantha N |
ప్రజ్వల్‌కు విదేశాంగ శాఖ షోకాజ్ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: సెక్స్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు విదేశాంగ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాసిన అనంతరం కేంద్ర సర్కారు నుంచి ఈ నోటీసులు జారీ కావడం గమనార్హం. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాట్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన అభ్యర్థన మే 21న వచ్చిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అది కూడా తమ పరిశీలనలో ఉందని తెలిపింది. ప్రజ్వల్ పాస్‌పోర్ట్ రద్దుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని అధికార వర్గాలు చెప్పాయి. రెడ్ కార్నర్, బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసినా.. ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి తిరిగి రాకపోవడంతో ఈ నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి.

వ్యతిరేకతను తగ్గించేందుకే దేవెగౌడ వార్నింగ్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్‌ను ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడే జర్మనీకి పంపారని ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకే ఇటీవల ప్రజ్వల్‌కు దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారని మండిపడ్డారు. గత నెలలో కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం బయటకొచ్చింది. ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ‌ను ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగికంగా వేధించారంటూ కేసు నమోదైంది. ఈ వ్యవహారం బయటపడటంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. ఈ కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఆయనకు చాలా సార్లు నోటీసులు జారీ చేసింది.

Next Story
null