IPL టైటిల్ రేసు నుండి RCB ఔట్.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

by Satheesh |
IPL టైటిల్ రేసు నుండి RCB ఔట్.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ రేసు నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు నిష్క్రమించిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో లీగ్ నుండి ఫస్టే బయటకు వెళ్లిపోతుందనుకున్న ఆర్సీబీ.. సెకండాఫ్‌లో అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అయినప్పటికీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడి పరాజయం పాలై ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ రేసు నుండి నిష్క్రమించింది. దీంతో ఐపీఎల్ టైటిల్ ముద్దాడాలనుకున్న ఆర్సీబీకి ఈ సీజన్‌లో కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. ప్లే ఆఫ్స్‌లోనే ఓటమి పాలు కావడంతో 17 సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన ఆర్సీబీకి మరోసారి మొండి చేయి మిగిలింది.

మరోసారి ట్రోఫీ గెలవకుండానే ఐపీఎల్ నుండి నిష్క్రమించడంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరుత్సాహాంలో కూరుకుపోయారు. ఈ క్రమంలో ఆర్సీబీ మద్దతుదారులను, తన ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ కోహ్లీ ఓటమి తర్వాత తొలిసారి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఇన్స్ స్టా గ్రామ్‌లో అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆర్సీబీ టీమ్ మేట్స్ ఫొటో షేర్ చేసిన రన్ మెషిన్.. ‘‘ఎప్పటిలాగే మమ్మల్ని ప్రేమించినందుకు, ప్రశంసించినందుకు ఆర్సీబీ అభిమానులు అందరికీ మరోసారి ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక, కోహ్లీ చేసిన ఎమోషనల్ పోస్ట్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ‘ఓడినా.. గెలిచిన ఆర్సీబీ ఫరెవర్’.. ‘వీ ఆర్ విత్ యూ ఛాంపియన్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో కోహ్లీ 700 ప్లస్ పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Next Story