Konda Surekha: కాంగ్రెస్ అంటే సాంబయ్యకు చాలా ఇష్టం

by Gantepaka Srikanth |

మాదారం పీఏసీఎస్ మాజీ చైర్మన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పూజారి సాంబయ్య మృతిపట్ల మంత్రి కొండా సురేఖ(Konda Surekha) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Konda Surekha: కాంగ్రెస్ అంటే సాంబయ్యకు చాలా ఇష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: మాదారం పీఏసీఎస్ మాజీ చైర్మన్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పూజారి సాంబయ్య మృతిపట్ల మంత్రి కొండా సురేఖ(Konda Surekha) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పూజారి సాంబయ్య మరణించడం బాధాకరం అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సాంబయ్య పాల్గొన్నారని గుర్తుచేశారు. తాను 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయినప్పటినుంచి ఒక సోదరిలాగా తనను ఆహ్వానించేవారన్నారు. సింగిల్ విండో చైర్మన్‌గా పని చేశారని తెలిపారు. కాంగ్రెస్ అంటే సాంబయ్యకు అమితమైన ఇష్టమని చెప్పారు. కొండా దంపతులు కూడా అంటే సాంబయ్యకి ఎనలేని అభిమానం అని చెప్పుకొచ్చారు. పూజారి సాంబయ్య మన అందరి మధ్యన లేకపోవడం తమకు తీరని లోటు అని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story