రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్​చీఫ్​

by Disha Web Desk 2 |
రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్​చీఫ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ మహిళా కాంగ్రెస్​చీఫ్​నెట్టా డిసౌజ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్​అధ్యక్షురాలు సునీతారావు, ఇతర ముఖ్య మహిళా కార్యకర్తలతో ఆమె భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్​లో పార్టీ డెవలప్​మెంట్ కోసం చేయాల్సిన యాక్టివిటీస్​పై రివ్యూ చేయనున్నారు. గాంధీ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత వివిధ జిల్లాల మహిళా కాంగ్రెస్​పార్టీ ఇంచార్జీలతో సమీక్ష ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాజీవ్​ గాంధీ క్విజ్​ పోటీల బ్రౌచర్‌ను ప్రారంభించనున్నారు.

Also Read..

కాంగ్రెస్ కేడర్‌లో జోష్.. లీడర్లలో పరేషాన్!


Next Story

Most Viewed