- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో నమోదైన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్(Nalgonda Municipal Corporation) చరిత్రలో నమోదైన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) నాయకత్వంలో పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కార్పొరేషన్‌పై పట్టు సాధించారు. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగారు. అభివృద్ధి మంత్రం మరియు స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా సాగిన ఈ ప్రచారానికి ప్రజలు పట్టం కట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతరం వార్డుల పర్యటన చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమవ్వడం పార్టీని విజయతీరాలకు చేర్చింది. నల్లగొండను మోడల్ కార్పొరేషన్‌గా సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్న హామీకి ఓటర్ల మద్దతు లభించడం విశేషం. పార్టీ కేడర్ అంతా సమిష్టిగా కృషి చేసి అభ్యర్థుల గెలుపునకు సహకరించడం.. నల్లగొండ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరోసారి నిరూపించుకుంది.






