ORR పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదు.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-15 07:45:44  IST  )

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

ORR పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదు.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జూబ్లీ‌హిల్స్ ఉప ఉన్నిక సందర్భంగా ఆయన వెంగళరావు నగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) రాక ముందు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రూ.20వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) రూపంలో బకాయిలు పెడితే.. తాము అధికారంలోకి వచ్చి క్లియర్ చేశామని అన్నారు. కానీ, రేవంత్ సర్కార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క చెప్పడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ హామీలో చూసి మోసపోయారని కేటీఆర్ కామెంట్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. యూరియా (Urea) కొరత కనిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు యూరియా‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని.. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ లారీ యూరియా ఎత్తుకెళితే.. మరి ఎమ్మెల్యే గోదాంలోని యూరియా దోచుకుని ఉంటాడని సెటైర్లు వేశారు. ఓఆర్ఆర్ (ORR) పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని.. 23 నెలల పాలనలో ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ అర్థం అవుతోందని అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తం ప్రైవేటు కాలేజీలు అన్నీ మూతపడే పరిస్థితి వచ్చాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఖరితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యపై దెబ్బ కొడుతున్నారని అన్నారు. చదువు పూర్తి అయినా.. రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కానీ.. కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం డబ్బులుంటాయని కేటీఆర్ కామెంట్ చేశారు.

Next Story