గ్రూప్​–1 విషయంలో బీఆర్​ఎస్​ విధానాలే కాంగ్రెస్ ​పాటిస్తుంది

by velandi.Saikiran |

గ్రూప్-1 పరీక్ష పత్రాల రీవాల్యూయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ

గ్రూప్​–1 విషయంలో బీఆర్​ఎస్​ విధానాలే కాంగ్రెస్ ​పాటిస్తుంది
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రూప్-1 పరీక్ష పత్రాల రీవాల్యూయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు, నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని తేల్చిందన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటకు వచ్చాయని ప్రభుత్వ వైఖరి లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.

నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ చాలా లోపాలతో కూడిన విధానాలను అవలంభించిందని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశారని ఈ తీర్పు ద్వారా వారికి న్యాయం జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీ ఘటనలతో వేలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అదే విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Next Story