బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో కుల సదస్సులు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీసీ కులగణనపై విస్తృత ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడానికి హస్తం పార్టీ రెడీ అవుతోంది.

బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో కుల సదస్సులు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీసీ కులగణనపై విస్తృత ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడానికి హస్తం పార్టీ రెడీ అవుతోంది. కులగణనపై ప్రజామోదాన్ని పొందడానికి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకోసం బీసీ కుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు, సదస్సులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. మార్చి 10లోపు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో కులాల వారీగా సదస్సలు నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్టు సమాచారం. శనివారం ఆయన ప్రజాభవన్‌లో జరిగిన బీసీ ప్రజాప్రతినిధులకు ఈ సూచనలు ఇచ్చారు.

బీసీ కేటగిరిలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కులంతో ముందుగా సమావేశం ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తరువాత గౌడ, యాదవ, కుర్మ, పద్మశాలి, చాకలి కులాలతో సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏర్పాట్ల బాధ్యతలను బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కు సీఎం రేవంత్ అప్పటించినట్టు తెలుస్తోంది. అలాగే జిల్లాల నుంచి జనాలను రప్పించే బాధ్యతలను నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు అప్పగించినట్టు సమాచారం.

Next Story