- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ డబ్బు పంచి గెలవాలనుకుంటోంది.. జూబ్లీహిల్స్ బైపోల్‌పై KTR హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్‌లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన నియోజకవర్గ వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ శ్రేణుకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఉదాహరణ అని అన్నారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు ఇంకా సెటిల్ కాలేదని తెలిపారు. మనం మళ్లీ అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబ తిరిగి నిలబడుతుందని కామెంట్ చేశారు.
తిరుపతి రెడ్డి ఇంటి మీదికి పోదు హైడ్రా..
హైడ్రా (HYDRA) పేరు మీద హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం విధ్వంసానికి తెగబడుతోందని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కర్మకాలి కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజలకు తమ ఇళ్లను తామే కూల్చుకున్న వారు అవుతారని కామెంట్ చేశారు. దుర్గం చెరువులో ఇళ్లు కట్టిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డి (Tirupati Reddy)ఇంటి మీదకి హైడ్రా పోదని.. వాళ్ల టార్గెట్ రహమత్ నగర్, బోరంబండ, యూసఫ్ గూడ, షేక్‌పేట్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో పేదోళ్ల ఇళ్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదు కానీ.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని ఆరోపించారు. రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఒక్కసారి వేశారని, ఇందిరమ్మ ఇళ్లు రాలేదు కానీ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారని ధ్వజమెత్తారు. మాగంటి గోపీనాథ్ ఉండ ఉంటే పేదలకు అండగా ఉండేవారని, కాంగ్రెస్ ఆటలు సాగేవి కావని కేటీఆర్ అన్నారు.






