- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండలో ఎదురులేని కాంగ్రెస్.. మొత్తం నాలుగు మున్సిపాలిటీలు కైవసం
నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. హాలియా, చండూరు, నందికొండ మున్సిపాలిటీలను హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని నాలుగు కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి, ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.
ఏకపక్షంగా నందికొండ, హాలియా ఫలితాలు..
నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అదేవిధంగా, హాలియా మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఇక్కడ 12 స్థానాలకు గాను 10 వార్డులను హస్తం పార్టీ గెలుచుకోగా, బీఆర్ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
చండూరులోనూ ‘హస్తం’ జోరు
తీవ్ర ఉత్కంఠ రేపిన చండూరు మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, బీఆర్ఎస్ 3 స్థానాలను దక్కించుకుంది. ఇక చిట్యాలలో 12 వార్డులకు గాను 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఒకే ఒక్క వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.






