- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీం తీర్పు.. బైపోల్ కు కాంగ్రెస్ సిద్ధమన్న ఎంపీ అనిల్ కుమార్
పార్టీ ఫిరాయించిన తెలంగాణకు 10 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Suprem Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన తెలంగాణకు 10 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Suprem Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంతీర్పుపై రాజ్యసభ కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar Yadav) స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఎవరూ బలవంతం చేయలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాభివృద్ధి, ప్రజాపాలన నచ్చి తమ పార్టీలోకి వచ్చారని తెలియజేశారు.
ఈ వ్యవహారంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన అనిల్ కుమార్... ఉప ఎన్నికలు(By-Pole) వస్తే కాంగ్రెస్ అందుకు సిద్ధంగానే ఉందని ధీమా వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ పాలనకు విసిగిపోయి జనం కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని, గడిచిన ఏడాదిన్నర పాలనలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రజలను మరోసారి మెప్పిస్తామని, మరోసారి బీఆర్ఎస్ కు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.






