- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం కావాలి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) కాంగ్రెస్ (Congress) శ్రేణులు సన్నద్ధం (Ready) కావాలని పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) కాంగ్రెస్ (Congress) శ్రేణులు సన్నద్ధం (Ready) కావాలని పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) పిలుపునిచ్చారు. ములుగు జిల్లా (Mulugu District) పర్యటనలో ఉన్న ఆమె.. గోవిందరావు పేట (Govindarao Peta)లో జరిగిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ముఖ్య కార్యకర్తల సమావేశం (Main Leaders Meeting)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఇప్పటినుంచే కార్యక్రమాలు మొదలు పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రవేశ పెట్టిన పథకాలను (Schemes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన (Congress Govt One Year Governance)లో అనేక సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలు చేసిందని, రైతు రుణమాఫీ (Loan Viewer), ఉచిత విద్యుత్ (Free Electricity), మహిళలకు ఉచిత బస్సు (Women Free Bus) ప్రయాణం, BC కమిషన్ (BC Commission), కులగణన (Caste Census), ఉద్యోగ నియామకాలు (Employement) వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ క్రమశిక్షణ పాటించాలని, ఎన్నికల్లో గెలుపు కోసం సమీష్టి కృషి చేయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మర్చిపోదని, ప్రతీ ఒక్కరికి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) చేసే అబద్ధపు ప్రచారాన్ని (False Publicity) తిప్పికొట్టాలని చెప్పారు. కాగా ఆదివారం ములుగు పర్యటనలో ఉన్న ఆమె.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత గోవిందరావు పేటలో పర్యటిస్తూ.. స్థానిక ప్రజలతో మమేకమై ముచ్చటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. చివరగా.. ములుగులో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఆటల్లో విజయం సాధించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.






