- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gandhi Bhavan: అమెరికాకు గులాంగిరి బంద్ ఖరో.. చేతులు, కాళ్లకు బేడీలతో కాంగ్రెస్ నేతలు
అమెరికాలో భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అమానవీయంగా, అవమానకరంగా కాళ్లకు, చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా(United States)లో భారతీయులను (Indian Migrants) అక్రమ వలసదారులుగా పేర్కొంటూ (Trump) ట్రంప్ ప్రభుత్వం అమానవీయంగా, అవమానకరంగా కాళ్లకు, చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని (Congress) కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలో (Gandhi Bhavan) గాంధీ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
చేతులకు బేడీలు వేసుకొని వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భారత పౌరులకు బేడీలు వేసి అమెరికా నుంచి పంపిస్తున్న చలనం లేనట్లు కేంద్రం వ్యహరిస్తుందని, ప్రధాని మోడీ, బీజేపీ సిగ్గు పడాలని, అమెరికాకు గులాంగిరి బంద్ ఖరో అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు.






