కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కలిసి రావాలి.. ట్యాంక్ బండ్‌‌పై కాంగ్రెస్ పార్టీ నిరసన

by Ramesh Naini |

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కలిసి రావాలి.. ట్యాంక్ బండ్‌‌పై కాంగ్రెస్ పార్టీ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2025)లో తెలంగాణకు అన్యాయం జరిగిందని (Congress) కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం హైదారాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా (Mahesh Kumar Goud) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంపై యుద్ధం ప్రకటించి రాష్ట్రానికి నిధులు సాధించాలని ఆయన వెల్లడించారు. అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయ పడుతుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందన్నారు. కేంద్రం వివక్షను ప్రజా క్షేత్రంలోనే ఎండగట్టాలని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుమార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చిన పట్టించుకోలేదని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Next Story