- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam: ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఉత్తమ్ కు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు
తెలంగాణ రాజకీయాల్లో అన్యూహ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠ రేపుతోంది. మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి శాఖల కేటాయింపు అంశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు రెండు రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మకాం వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ (Uttam Kumar Reddy) రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన హుటాహుటీన ఢిల్లీకి పయనం అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ కు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. అయితే ఉన్నపలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సి ఉంది. ఇవేవి కాకుండా పార్టీ పరంగా ఎదైనా కీలక మార్పు ఉండబోతున్నదా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.






