- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారంలో ఉన్నప్పటికీ బంద్‌లో పాల్గొంటున్నాం.. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన
బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం రేపు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోయే బంద్‌కు కాంగ్రెస్ పార్టీ(Congress Party) సంపూర్ణ మద్దతు ఇస్తోందని మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం రేపు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోయే బంద్‌కు కాంగ్రెస్ పార్టీ(Congress Party) సంపూర్ణ మద్దతు ఇస్తోందని మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరోసారి చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని అన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి బంద్‌లో పాల్గొంటున్నామని చెప్పారు. అంతకుముందు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో బీసీ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విద్యాసంస్థలు, బస్సులు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.






