- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు కాంగ్రెస్ PAC సమావేశం.. స్థానిక ఎన్నికలపై కీలక చర్చ
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, టీపీసీసీ అడ్వజరీ కమిటీ సమావేశం కమిటీ సమావేశం (రెండు కలిపి) రేపు సాయంత్రం కీలక సమావేశం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, టీపీసీసీ అడ్వజరీ కమిటీ సమావేశం కమిటీ సమావేశం (రెండు కలిపి) రేపు సాయంత్రం కీలక సమావేశం కానున్నాయి. గాంధీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన వహిస్తుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర సభ్యులు పాల్గొననున్నారు. అయితే ఈ భేటీ కీలక ఉద్దేశం తెలంగాణలో స్థానిక ఎన్నికల అంశం అని సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి అని ప్రభుత్వం చూస్తుండగా.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.
మరోవైపు గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ కూడా న్యాయసలహా కోసం పంపడంతో అది కూడా పెండింగ్ లోనే ఉంది. కాగా స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30 సమీపిస్తుండగా.. ఎన్నికలపై ఏం చేయాలా అని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ అంశంపై చర్చించడానికే ఈ సమావేశం జరుగనుందని సమాచారం. ఈ భేటీలో సభ్యుల మెజారిటీ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని దానిని ఈనెల జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్టు తెలుస్తోంది.






