Congress: అధికారం పోయిందన్న అక్కసుతో కేటీఆర్ కామెంట్స్

by Gantepaka Srikanth |

రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం తప్పదని, అధికారం నుంచి దిగిపోయి..

Congress: అధికారం పోయిందన్న అక్కసుతో కేటీఆర్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం తప్పదని, అధికారం నుంచి దిగిపోయి.. ప్రజలు ఛీకొట్టినా.. లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.. అధికారం పోయిందన్న అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అయినా వారిలో మార్పు రావడం లేదని కాంగ్రెస్​ఎంపీ మల్లు రవి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లును ప్రవేశపెట్టి.. గవర్నర్ దగ్గరకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం.. 3 నెలల వరకు బిల్లును క్లియర్ చేయకపోతే.. ఆమోదించినట్టుగానే భావించి.. ప్రభుత్వం అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని మల్లు రవి తెలిపారు. తెలంగాణ హైకోర్టు కూడా.. అక్టోబర్ 30 లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది..దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో రిజర్వేషన్లు అమలు చేయాలని సంకల్పించారని, గతంలో ఎంతో మంది ఈ రిజర్వేషన్లపై రాజకీయాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే సాధ్యమైందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాలను గమనించి, కాంగ్రెస్ కి ఓట్లు వేసి మీకు బుద్ధి చెబుతారుని మల్లు రవి చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అస్తిత్వాన్ని కోల్పోతుందని, బీఆర్ఎస్ నేతలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అని ఆయన హితవు పలికారు.

Next Story