‘కర్మ రిటన్స్’ అని కవిత చేసిన ట్వీట్ మర్చిపోయావా?.. కేటీఆర్: కాంగ్రెస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-12 11:28:17  IST  )

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమిపై కవిత చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్ ఎంపీ గుర్తుచేశారు.

‘కర్మ రిటన్స్’ అని కవిత చేసిన ట్వీట్ మర్చిపోయావా?.. కేటీఆర్: కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించడం సరికాదని అన్నారు. ఒకసారి ఫామ్‌హౌజ్‌కు వెళ్లి కేసీఆర్‌ను అడిగితే అసలు విషయం కేటీఆర్‌కు తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏకపాత్రాభినయం చేయాలని పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం మొదలు పెట్టిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూశారని అన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో చేయవచ్చో కేసీఆర్ నిరూపించారని తెలిపారు. అవసరం అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎట్లా ఇవ్వవచ్చో కేసీఆర్ రుజువు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

అందుకే స్పీకర్‌ను టార్గెట్ చేశారు?

స్పీకర్ దళితుడు కాబట్టే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. సైకిల్ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి, హస్తం గుర్తుపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెబుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రాహుల్ గాంధీని తిట్టాలన్న అజెండాతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్మడం లేదు, ఓట్లు వేయడం లేదని కేటీఆర్ జిమ్‌కు వెళ్తున్నారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీకి అక్కసు ఎందుకు’ అని చామల కిరణ్ ప్రశ్నించారు.

అమిత్ షా ఒక స్టేట్మెంట్ - బండి సంజయ్ ఒక స్టేట్మెంట్..

స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. స్పీకర్ అధికారాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవని నిన్ననే లోక్‌సభలో అమిత్ షా మాట్లాడారు. స్పీకర్ అధికారాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక స్టేట్ మెంట్ సహాయ మంత్రి బండి సంజయ్ మరో స్టేట్ మెంట్ ఇస్తున్నారు. స్పీకర్ గురించి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే మాట్లాడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయింది. కాంగ్రెస్ పాలనను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని ఎందుకు బీజేపీ అడ్డుకోలేదు. కేటీఆర్ సొంత చెల్లి కర్మ రిటన్స్ అని ట్వీట్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇంటర్నల్ ఒప్పందం తెలంగాణ ప్రజలకు తెలుసు. కేటీఆర్ మాట్లాడితే గురివింద గింజ సిగ్గు పడుతుంది. బండి సంజయ్ మీ బాస్ అమిత్ షా గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎలాంటి ఫిరాయింపులు చేశారో గుర్తు లేదా..? అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు.. కీలక అభ్యర్థన

Next Story