- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ తనకు తానే శిక్ష వేసుకున్నాడు.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు హరీష్ రావు మైండ్ బ్లాక్ అయ్యి మతి స్థిమితం కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు హరీష్ రావు మైండ్ బ్లాక్ అయ్యి మతి స్థిమితం కోల్పోయారు. స్వయం పాలన, అస్తిత్వం, మోకరిల్లడం, ఆత్మగౌరవం అని పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండు సున్నా వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండు సున్నా మిగిలింది. మీ చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. హరీష్ రావు లేఖ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఢిల్లీ అధిష్టానం వద్ద కేబినెట్ మీటింగ్ జరగడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
సొల్లు కబుర్లు చెప్పడం బంద్ చెయ్..
కేబినెట్ మీటింగ్ 23వ తేదీన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లోనే జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగా ఫామ్ హౌస్ పాలన నడపడంలేదు. పార్టీ వ్యవహారాలను చర్చించడానికి అధిష్టానం పెద్దలు తెలంగాణ ముఖ్య నేతలను పిలిచారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలకు సొల్లు కబుర్లు చెప్పడం హరీష్ రావు బంద్ చేయాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ భాద్యత మరింత పెరిగింది. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుంది. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. పది సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం దోచుకుంది.. దాచుకుంది. పదేళ్లలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది.
హరీష్ రావుకు అర్హత లేదు..
బావా, బామ్మర్దులు ఇద్దరూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌ను జైలుగా చేసుకుని అక్కడే ఉంటున్నారు. మీరే వెళ్లి జైలులో ములాఖత్ అయినట్లు కలిసి వస్తున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు, అసెంబ్లీకి రావడం లేదు. తనకు తాను శిక్ష వేసుకుని ఫామ్ హౌస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు. సంస్థాగతంగా నీ పార్టీ స్థాయి ఏంటో తెలుసుకో హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది.. బీఆర్ఎస్ అధిష్టానం ఫామ్ హౌస్‌లో ఉంది. తెలంగాణ ప్రజలు తప్పు చేశారని బీఆర్ఎస్ నేతలు పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. చిల్లర మల్లర మాటలు, ఉత్తరాలతో ఏం కాదు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 24 గంటలు పని చేస్తున్నారు’ అని హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






