‘కర్మ ఎవరినీ వదలదు.. వెతుక్కుంటూ వచ్చి మరీ ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్తది’: కేటీఆర్‌కు కాంగ్రెస్ MP కౌంటర్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

‘కర్మ ఎవరినీ వదలదు.. వెతుక్కుంటూ వచ్చి మరీ ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్తది’: కేటీఆర్‌కు కాంగ్రెస్ MP కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇతరుల ఫోన్‌లు ట్యాపింగ్ చేయడం.. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిండచం కాదా. రాజ్యాంగంలోని హక్కులన్నీ కేవలం మీకోసమే రాసిచ్చారా?. ఇతరుల గోప్యతను కాలరాసి ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టారో మరిచిపోయారా?. మీ దాకా వస్తే కానీ తెలియలేదా?. కర్మ అనేది ఎవరినీ వదలదు. ఎక్కడ ఉన్నా వెతుక్కుని మరీ ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్లిపోతుంది’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఫార్ములా-ఈ రేసు కేసులో మొబైల్ ఫోన్లు సమర్పించాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను కోరారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ.. విచారణకు ఫోన్ అడగడమనేది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని తెలిపారు. అయితే.. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా చామల కిరణ్ ట్వీట్ పెట్టారు. ఈ సోయి ఇతరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించినప్పుడు లేదా? అని తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ట్వీట్

Next Story