- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి: కాంగ్రెస్ ఎంపీ
సీఎం పదవి కోసం కేటీఆర్, పార్టీని మొత్తం లాక్కోవాలని హరీష్ రావు చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం పదవి కోసం కేటీఆర్, పార్టీని మొత్తం లాక్కోవాలని హరీష్ రావు చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నటికీ కేసీఆర్(KCR) చావును కోరుకునే వ్యక్తి కాదని తెలిపారు. కమీషన్ల కోసమే కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కళ్ళకు కట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వివరించారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని బీఆర్ఎస్ తుంగలో తొక్కింది. బావా, బామ్మర్దులు(కేటీఆర్, హరీష్ రావు) దొంగలుగా దొరికారు. కేసీఆర్ చావును సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని పదేపదే అసత్య ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై ఇద్దరూ విష ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మంచిగా ఉండాలనే రేవంత్ రెడ్డి కోరుకుంటారని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి స్వయంగా వెళ్లి పరామర్శించారని తెలిపారు. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ బాగోగులు అడిగి తెలుసుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే అందరం కోరుకుంటున్నామని అన్నారు.
కేసీఆర్ సమాధానం చెప్పాలి
ప్రజలను ఏం చేద్దామని కాళేశ్వరం కడదామని అనుకున్నారు. అదే విధంగా పాలమూరు - రంగారెడ్డి సోర్స్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలి. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి తెలంగాణను రావణ రాజ్యంలా మార్చారు. బీఆర్ఎస్ పదేళ్ల దౌర్భాగ్యమైన పరిపాలన వల్లనే ప్రజలు రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం ఇచ్చారు. తమ నాయకత్వానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని చెప్పి కేసీఆర్ కుమార్తె కవితను కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. కవిత వీరిద్దరి గురించి మాట్లాడుతూనే ఉంది.






