కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ

by Ramesh Naini |   (  Updated:2026-01-23 14:52:19  IST  )

సింగరేణి పరిధిలోని నైని బొగ్గు క్షేత్రానికి సంబంధించిన టెండర్‌‌పై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి పరిధిలోని నైని బొగ్గు క్షేత్రానికి సంబంధించిన టెండర్‌‌పై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ సాంకేతిక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో తలెత్తిన వివాదంపై తక్షణమే స్పందించి ఇద్దరు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణకు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కేవలం నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు అంశానికే ఈ విచారణను పరిమితం చేయవద్దని సూచించారు. సింగరేణిలో గడిచిన పదేళ్ల కాలంలో జరిగిన అన్ని టెండర్లు, అధికారిక ప్రక్రియలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. గత పదేళ్లుగా జరిగిన టెండర్ల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని కోరారు. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలో పారదర్శకత, ప్రజాహితాన్ని కాపాడటం అత్యంత అవసరం అని పేర్కొన్నారు.

Next Story