- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ బుద్ధి తక్కువ పని చేసింది
by Gantepaka Srikanth |
తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న 1,600 మంది అమరవీరులను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అవమానించారని.. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న 1,600 మంది అమరవీరులను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అవమానించారని.. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ.. తేజస్వి సూర్యకు తెలంగాణపై ఏం అవగాహన ఉన్నదని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి సమర్థిస్తూ లోక్‌సభలో మాట్లాడారని.. ఆయన తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీకి 8 లోక్‌సభ సీట్లు ఇచ్చిందని.. బీజేపీని గెలిపించి బీఆర్ఎస్ బుద్ధి తక్కువ పని చేసిందన్నారు.
Next Story






