- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత లేఖ లీక్.. బీఆర్ఎస్ చాలా వీక్ : ఎంపీ చామల
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ( Chamala Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. లీక్ అయిన కవిత ( Kavitha)

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ( Chamala Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. లీక్ అయిన కవిత ( Kavitha) లేఖ చూస్తుంటే బీఆర్ఎస్ ( BRS) వీక్ అయినట్లు కనపడుతోందన్నారు ఎంపీ చామల. కేటీఆర్ కు (KTR) పట్టాభిషేకం అని ప్రచారం జరగడంతో కవిత, హరీష్ రావు లలో ఆందోళన మొదలైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కవిత లేఖలో అనేక ముఖ్య అంశాలకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఫైర్ అయ్యారు.
అంత పెద్ద సభలో వేరే ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కవిత స్పష్టం చేసిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యలు, బీసీ కులగణన, బీజేపీని ఎండగట్టంపై మాట్లాడితే బాగుండు డాడీ అని కవిత ఆవేదన వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి మద్దతు ఇచ్చిందని స్వయంగా కవితనే చెప్తుందని వెల్లడించారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత లేదని కూడా తేటతెల్లం చేసిందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి, కవిత లేఖపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో వెల్లడించాలన్నారు. ఇది ఇలా ఉండగా అటు కల్వకుంట్ల కవిత లేఖపై కేసీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. దీనిపై కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిచారని అంటున్నారు. పలువురు పార్టీ నేతలతో కేసీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారట. లేఖ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు కేసీఆర్.






