డీలిమిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి.. కాంగ్రెస్ MLC డిమాండ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-15 09:58:42  IST  )

డీలిమిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి.. కాంగ్రెస్ MLC డిమాండ్

డీలిమిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి.. కాంగ్రెస్ MLC డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ఇతర మహా నగరాలతో పోటీపడి అభివృద్ధిలో ముందుకుసాగడానికి, పరిపాలన సులభతరం, ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేయడానికి వార్డుల డీలిమిటేషన్ ఎంతో అవసరం, ఈ ప్రక్రియను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmoor Venkat) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో వార్డుల విభజన శాస్త్రీయ పద్దతిలో ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయలు తీసుకుని, పరిశీలించాలి చేపట్టాలని అభిప్రాయపడ్డారు. వార్డుల డిలిమిటేషన్ ఏయే అంశాల ప్రతిపాదన చేస్తున్నారు. పాపులేషన్, ఫొటోగ్రాఫికల్, నియోజకవర్గాల వారీగా చేస్తున్నారా.. అనేది వివరించాలని అన్నారు.

రేపటి కౌన్సిల్ సమావేశంలో డిలిమిటేషన్ ఏ విధంగా చేస్తున్నారనేది ప్రెజెంటేషన్ ఇవ్వాలి, అప్పుడు అందరికీ అవగాహన కలుగుతుందని చెప్పారు. ఈనెల 17వరకు అభ్యంతరాలు చెప్పాలి అన్నారు. కాబట్టి ప్రజా ప్రతినిధులంతా తమ అభిప్రాయాలు తెలియజేశారని వెల్లడించారు. రేపు(డిసెంబర్ 16) లిఖిత పూర్వకంగా అభ్యంతరాలను చెప్తాము. ప్రజా ప్రతినిధులు వార్డుల డీలిమిటేషన్‌లో ఇచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిశీలించాలని అన్నారు.

Next Story