‘వాలంటైన్స్‌ డే స్పెషల్.. బీజేపీ కోసం సర్వం త్యాగం చేసిన బీఆర్ఎస్’

by Gantepaka Srikanth |

బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ ప్రేమ కోసం కరీంనగర్, నిజామాబాద్‌లో బీఆర్ఎస్ చచ్చిపోయిందని అన్నారు. బీజేపీ కోసం ప్రాణత్యాగం చేసిన బీఆర్ఎస్‌కు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంటూ అద్దంకి దయాకర్ విమర్శలు చేశారు.

‘వాలంటైన్స్‌ డే స్పెషల్.. బీజేపీ కోసం సర్వం త్యాగం చేసిన బీఆర్ఎస్’
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ ప్రేమ కోసం కరీంనగర్, నిజామాబాద్‌లో బీఆర్ఎస్ చచ్చిపోయిందని అన్నారు. బీజేపీ కోసం ప్రాణత్యాగం చేసిన బీఆర్ఎస్‌కు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంటూ అద్దంకి దయాకర్ విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్, నిజామాబాద్‌లో కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ద్వేషం తప్ప ప్రేమ తెలియదని అన్నారు. హంగ్‌ను చూసి బండి సంజయ్ ఖంగుతిన్నారు.. ఆ తర్వాత ప్రలోభాలు మొదలు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైందని అద్దంకి దయాకర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 1347 వార్డుల్లో విజయం సాధించింది. అదే సమయంలో 116 మున్సిపాలిటీలకు గానూ 64 మున్సిపాలిటీల్లో హస్తం పాగా వేసింది. ఆ తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ 717 వార్డులను గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసింది. మరోవైపు.. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకంగా 256 వార్డుల్లో జయకేతనం ఎగువేశారు. మరోవైపు.. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ ఐదింట్లో విజయం సాధించింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకునే అకాశాలు కన్పిస్తున్నారు. కరీంనగర్‌ను బీజేపీ కైవసం చేసుకుంది.

Next Story