- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇద్దరిలో ఎవరికి దమ్మున్నా నా సవాల్ స్వీకరించండి’.. కేటీఆర్, హరీష్ రావుకు ఎమ్మెల్సీ సవాల్
కేటీఆర్, హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ సవాల్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) విడుదల చేసిన బాకీ కార్డులపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoor Venkat) సవాల్ చేశారు. ఇద్దరిలో ఎవరికి దమ్మున్నా.. నా సవాల్‌ను స్వీకరించాలని హరీష్ రావు, కేటీఆర్‌కు ఛాలెంజ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల ప్రజా పాలనపై ప్రజల సమక్షంలోనే చర్చిద్దామని అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో నెలకొన్న సమస్యలనే మీరు పరిష్కరించుకోలేకపోతున్నారు.. ఇంక ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి, మంత్రుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. బాకీ కార్డుల పేరుతో హడావిడి చేస్తున్న హరీష్ రావు... బీఆర్ఎస్ పరిపాలనలో బాకీ పడ్డా హామీల సంగతి మరిచి పోయారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ యూనివర్సిటీకి వెళ్లలేదు, ఏనాడు ఏ లైబ్రరీకి వెళ్లలేదని మండిపడ్డారు. అవన్నీ నీరుద్యోగులు మరిచిపోయారని అనుకుంటే.. పొరపాటు పడినట్లే అని అన్నారు. ఆనాడు ఓ నిరుద్యోగ సోదరి ఆత్మహత్య చేసుకుంటే... దానిని కూడా వక్రీకరించిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్‌ది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్లు వేసినట్లే వేసి నిరుద్యోగులను ఎంతో ఇబ్బంది పెట్టారు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చిక్కులన్నీ క్లియర్ చేసి అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చారని గుర్తుచేశారు.






