Congress : కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

జూబ్లీహిల్స్ ఫలితాలతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, పులకేశి లెక్కా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Congress : కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఫలితాలతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, పులకేశి లెక్కా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ ఎమ్మెల్యే పై విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని, IAS అధికారులను విచారించాలంటే DOPT నుంచి అనుమతి తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకునే.. చట్టపరంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఆరోపణలకు సమాధానం కాదని చెప్పారు. నీపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడాలే తప్పా.. విషయాన్ని తప్పుదోవ పట్టించేలా.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు సరికాదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ ఏంటో.. బీఆర్ఎస్ ఏంటో తేలిపోతుంది అన్నావు.. కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ అన్నావు, ఏమైంది? అని నిలదీశారు.

కారును జూబ్లీహిల్స్ ప్రజలు బండకేసి కొట్టలేదా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావని విమర్శలు గుప్పించారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మాట్లాడమని చెప్తే.. లై డిటెక్టర్ పరీక్షలు అని మాట్లాడుతున్నావని అన్నారు. దమ్ముంటే.. నీపై వచ్చిన ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వు.. అని సవాల్ విసిరారు. లేకుంటే.. ఆనాడు మంత్రిగా అన్ని నేనే చేశాను.. నేనే చెబితేనే అధికారులు చేశారని ఒప్పుకో అని సూచనలు ఇచ్చారు. ACB విచారణలో ఓ మాట, బయట పబ్లిక్‌లో ఓ మాట మాట్లాడితే, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్, హరీశ్‌రావుపై ఉందన్నారు. తీరు మార్చుకోకపోతే.. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ అయినా వచ్చింది, రానున్న ఎన్నికల్లో అయింత డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నువ్వు మళ్ళీ అమెరికాకు పారిపోవాల్సి వస్తుంది జాగ్రత్త.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దమ్ముంటే రెండేళ్ల ప్రజాపాలనపై అసెంబ్లీలో చర్చకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను తీసుకుని కేటీఆర్ రావాలని ఛాలెంజ్ చేశారు. సభ వేదికగానే మీ పదేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధి, మా రెండేళ్ల ప్రజాపాలనపై చర్చిద్దామని తెలిపారు.

Next Story