Congress MLC: కౌశిక్ రెడ్డిని చూసి వాళ్లు సిగ్గుపడుతున్నారు

by Gantepaka Srikanth |   (  Updated:2024-09-16 10:28:28  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)ని చూసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారని కాంగ్రెస్(Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoori Venkat) విమర్శించారు.

Congress MLC: కౌశిక్ రెడ్డిని చూసి వాళ్లు సిగ్గుపడుతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)ని చూసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారని కాంగ్రెస్(Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoori Venkat) విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామా? అని ఇప్పుడు నియోజకవర్గ ప్రజలంతా తలలు పట్టుకుంటున్నారని అన్నారు. మంగళవారం బల్మూరి వెంకట్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డికి ఓటు వేసి గెలిచిపించింది ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని.. కానీ, ఇలా మహిళలను కించపరిచేలా మాట్లాడి నియోజకవర్గ పరువు తీస్తాడని కాదని వెంకట్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తనకు ఓటు వేసి గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.. గెలిచిన తర్వాత తనకు ప్రాణహాని ఉందని కొత్త పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. ఇకనైనా కౌశిక్ రెడ్డి విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు.

Next Story