నీకు ఎండ్ కార్డు వేస్తున్నాం.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక

by Ramesh Naini |   (  Updated:2026-02-09 11:24:26  IST  )

కేటీఆర్.. నువ్వెంత గింజుకున్నా సిరిసిల్ల‌లో నీకు ఎండ్ కార్డు వేస్తున్నాం.. తెలంగాణ లో నీ క‌థ క్లైమాక్స్‌కు చేరిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్యూరి వెంకట్ హెచ్చరించారు.

నీకు ఎండ్ కార్డు వేస్తున్నాం.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేటీఆర్.. నువ్వెంత గింజుకున్నా సిరిసిల్ల‌లో నీకు ఎండ్ కార్డు వేస్తున్నాం.. తెలంగాణ లో నీ క‌థ క్లైమాక్స్‌కు చేరిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్యూరి వెంకట్ హెచ్చరించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మట్లాడారు. కేటీఆర్ క‌థ ముగిసిందని, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌ను చిత్తు చిత్తుగా ప్ర‌జ‌లు ఓడించ‌బోతున్నారని విమర్శించారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కాళ్ల కింద భూమి క‌దిలిపోవ‌డంతో కేటీఆర్ కుత‌కుత ఉడికిపోతున్నాడని మండిపడ్డారు. రాజ‌కీయ భ‌విష్య‌త్తు గ‌ల్లంతు అవుతుంద‌న్న భ‌యంతో సీఎం పైన నోరు పారేసుకుంటున్నాడన్నారు. అస‌హ‌నంతో నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ నువ్వు ఎవరు..?

కేటీఆర్ నువ్వు ఎవరు..? తెలంగాణ ఉద్య‌మంలో నీ పాత్ర ఎంత‌? అని ప్రశ్నించారు. అమెరికాలో అంట్లు క‌డుక్కుని బ‌తికేటోడ‌వి మీ అయ్య అడ్డం పెట్టుకుని తెలంగాణ‌కు వ‌చ్చిన‌వు అని విమర్శించారు. కేకే మ‌హేంద‌ర్ రెడ్డి లాంటి ఉద్య‌మ‌కారుడి గొంతుకోసి సిరిసిల్ల సీటు సంపాదించిన‌వు అని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప‌దేళ్లు ఎన్నో నీచ‌పు ప‌నులు చేశావు.. పాస్ పోర్టు బ్రోక‌ర్లు ఎవ‌రో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసు అని ఆరోపించారు. ప‌దేళ్లు ఎవ‌రు బ్రోక‌ర్ ప‌నులు, బేకారు ప‌నులు చేశారో చిన్న పిల్ల‌ల‌ను అడిగినా చెపుతారన్నారు. ఏమీ పీక‌లేరు అని ఎగిరెగిరి ప‌డుతున్నావని అన్నారు. కేటీఆర్.. నిన్ను, నీ అయ్యను ప‌దవి నుంచి పీకిందే మా రేవంత్ రెడ్డి.. అన్నారు. కేటీఆర్ నీ భాష మార్చుకోక పోతే నిన్ను, నీ అయ్యను ఉరికించి కొడతారని హెచ్చరించారు. సొంత చెల్లికి సమాధానం చెప్పలేని నీకు ఎందుకు ఈ బ‌తుకు అని ఎమ్మెల్సీ వెంకట్ నిలదీశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల మధ్యే పోటీ: సీఎం రేవంత్ రెడ్డి

Next Story