కేసీఆర్ మూడోసారి సీఎం అయితే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ లాగా అయ్యేది.. అద్దంకి దయాకర్ కౌంటర్

by Ramesh Naini |

కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వస్తే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ దేశాలుగా అయ్యేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు ​విమర్శలు చేశారు.

కేసీఆర్ మూడోసారి సీఎం అయితే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ లాగా అయ్యేది.. అద్దంకి దయాకర్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ (KCR) మూడో సారి అధికారంలోకి వస్తే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ దేశాలుగా అయ్యేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఘాటు ​విమర్శలు చేశారు. ఫాంహౌజ్​లో పార్టీ నేతల భేటీలో కేసీఆర్​ చేసిన కామెంట్లపై అద్దంకి దయాకర్​ కౌంటర్ ​ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ​మోసం చేసిందని ప్రజలకు చెప్పాలంటున్న కేసీఆర్ తన కూతురు కవిత పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్లిందో చూసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేయాలనుకున్నారని, రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లిపోతే తమ సీఎం రేవంత్​రెడ్డి ఆ అప్పులను తీర్చి పరిస్థితులు చక్కదిద్దు తున్నారని, ఆ విషయం కేసీఆర్​ మెచ్చుకునేది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. రేవంత్ తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా మెరుగు పరుస్తున్నారని దయాకర్​చెప్పారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు సైకోలు, కాలకేయుల్లాగా దాడి చేస్తున్నారని, కేసీఆర్ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని ఆయన మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్‌​రావులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వీరు రాజకీయ నేతలేనా అనే సందేహాలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇదే పరిస్థితిని బీఆర్ఎస్ కొనసాగిస్తే తెలంగాణ నుంచి ఆ పార్టీ మాయం అవుతుందని అద్దంకి దయాకర్ అన్నారు.

Next Story