TG: కేటీఆర్‌ది థర్డ్ క్లాస్ బ్రెయిన్.. ప్రభుత్వ విప్ ఫైర్

by Gantepaka Srikanth |

కేటీఆర్‌వి థర్డ్ క్లాస్ బుద్ధులు, కేసీఆర్, కేటీఆర్ థర్డ్ క్లాస్ ఆలోచనలు చేసినందునే ప్రజలు ఓడించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

TG: కేటీఆర్‌ది థర్డ్ క్లాస్ బ్రెయిన్.. ప్రభుత్వ విప్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌వి థర్డ్ క్లాస్ బుద్ధులు, కేసీఆర్, కేటీఆర్ థర్డ్ క్లాస్ ఆలోచనలు చేసినందునే ప్రజలు ఓడించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి పైన ఇండియా కూటమి రాజకీయపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా పాయింట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పి మోసం చేశారని, కంచె ఐలయ్యకు మా పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. కాళేశ్వరం అవినీతి పైన పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ పైన కేసీఆర్, హరీష్ రావు ఎందుకు హైకోర్టు వెళ్లారని, నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే కోర్టును ఆశ్రయించడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించిన తర్వాత నివేదిక పైన ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, కాళేశ్వరం కమిషన్‌ను చూసి కేసీఆర్, హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

కాళేశ్వరం కమిషన్ పైన హైకోర్టును ఆశ్రయించడంతో కేసీఆర్, హరీష్ రావు తాము తప్పు చేశామని ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అనేక అవకతవకలను కమిషన్ స్పష్టం చేసిందని, దాదాపు ఆరు నెలల పాటు అనేక మందిని విచారించిన తర్వాతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇంజినీర్లను కూడా విచారించిందని, ఇంజినీర్లను కాదని కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ తేల్చిందని ఆది శ్రీనివాస్ చెప్పారు. తమ తప్పులను కమిషన్ ఎత్తి చూపడంతో కేసీఆర్, హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డారని, అసెంబ్లీలో చర్చ వస్తే తెలంగాణ ప్రజలంతా వాళ్ళ పాపాలను వింటారన్న భయంతో హైకోర్టుకు వెళ్లారని ఆయన విమర్శించారు.

కమిషన్లకు కక్కుర్తి పడి మేడిగడ్డను కూల్చినప్పుడే వాళ్ల పరువు గోదావరిలో కలిసి పోయిందని, జ్యూడిషీయల్ కమిషన్లకు చట్టబద్దత ఉంటుందన్నారు. ఎవరిపైనా పిలిచి మాట్లాడే అధికారం కమిషన్‌కు ఉంటుందని ఆది శ్రీనివాస్​చెప్పారు. గతంలో ఏలేరు స్కాంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా జస్టిస్ సోమశేఖర కమిషన్ ముందు హాజరయ్యారని, చిన్న చెక్క కుర్చీ పైన చంద్రబాబు గంటల కొద్ది కూర్చుని విచారణలో పాల్గొన్నారన్నారు. సాంకేతిక కారణాలు చూపించి కాళేశ్వరం అవినీతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, చట్టపరంగా విధించే శిక్షలకు కూడా మీరు సిద్ధంగా ఉండాలని ఆది శ్రీనివాస్​చెప్పారు. యూరియా కొరత పైన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, యూరియా కేటాయింపులు ఎవరి పరిధిలో ఉంటాయో కేటీఆర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. యూరియా కేటాయింపులు, కేంద్రం తీరు పైన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కుళ్లుతోనే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, రైతులపైన కేటీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

Next Story