- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పు చేస్తే ప్రధాని కూడా విచారణకు రావాలి.. ఈటల రాజేందర్ ఎంత?: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
కాళేశ్వరం కమిషన్ విచారణపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ విచారణపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చారని బీజేపీ అధిష్టానం అంటోంది.. తప్పు చేస్తే ప్రధాని మోడీ అయినా సరే విచారణకు హాజరు కావాల్సిందే.. ఈటల రాజేందర్ ఓ లెక్కా అని సీరియస్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కనుసన్నల్లోనే అంతా జరిగిందని అన్నారు. 2018-2023 వరకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లతో బీఆర్ఎస్‌కు రూ.14 వందల కోట్లు వచ్చాయి. బాండ్లు అన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమే అని అన్నారు.
అంతకుముందు ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టాలి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయపబ్బం గడపవద్దని కాంగ్రెస్(Congress Govt)ను హెచ్చరిస్తున్నా అని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను. రాజకీయ లబ్ధి ఆశించి ఏనాడూ దిగజారే పనులు చేయను అని కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.16,500 కోట్లతో తుమ్మిడిహట్టి - చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టారు. మళ్ళీ దానిని 38 వేల కోట్లకు పెంచారు. కానీ అది రూ.82 వేల కోట్లకు ఎలా వెళ్లిందో నాకు తెలియదు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు కూడా చెప్పాను. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే. ఇదే విషయాన్ని స్వయంగా ఆయనే పలుమార్లు చెప్పారు అని ఈటల గుర్తుచేశారు.






