- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రిని ఉరితీసినా తప్పులేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
కృష్ణానదిని పూడ్చి భూకబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఉరితీసినా తప్పులేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణానదిని పూడ్చి భూకబ్జాకు పాల్పడిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఉరితీసినా తప్పులేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడారు. నిరంజన్ రెడ్డి భూ కబ్జా పైన తాను రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. ఈ వ్యవహారంపై గద్వాల్ కలెక్టర్ విచారణ జరిపి మనవపాడు మండలం చండూరు గ్రామంలో సర్వే నెంబర్ 57లో రెండు ఎకరాల 19 గుంటల భూమిని కబ్జా చేశారని తేల్చారు. ఆక్రమించుకున్న భూమి నుంచి ఫెన్సింగ్ తీయించారు. భూ కబ్జాల ఫైల్స్‌ను మాయం చేయడం కోసం మానపాడు ఎమ్మార్వో ఆఫీస్‌ను తగలబెట్టారు.
నిరంజన్ రెడ్డి కూతురు ప్రత్యూష రెడ్డి భూమి ఆక్రమించినట్టుగా కూడా తేలింది. ఈ కబ్జాలకు నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. భూ ఆక్రమణలు ప్రశ్నించిన మాపైన ఇష్టానుసారంగా తిట్టాడు. దీనిపై నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అంతే కాదు ఆయన ఇంట్లో పనిచేసే వంటవాడి పేరు మీద సబ్సిడీ తీసుకుని తర్వాత తన పేరు మీద మార్చుకున్నాడు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ. 27500 కోట్లు ఖర్చు చేసి ఎకరానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. జాతికి అంకితం చేశామని హడావుడి చేశారు. కేసీఆర్ ప్రారంభించి హెలికాప్టర్ దిగేసరికి మోటార్లు ఆపారు.
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్లేలా గత ప్రభుత్వంలోనే డిజైన్ చేశారని గుర్తుచేశారు. వనపర్తి లోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి రూ.650 కోట్లు బకాయి ఉన్నాయి. 50 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. దీనికి కారణం నిరంజన్ రెడ్డినే అని అన్నారు. భూ కబ్జాదారు నిరంజన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరు. ఆయనను మెంటల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని సూచించారు.






