- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ చేసిన నిర్మాణం అదొక్కటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ చేసిన నిర్మాణం అదొక్కటే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. రైతుల పక్షాన మోడీ(PM Modi), కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీకి భయపడుతున్నారని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. కేసులు బిగుసుకుంటాయని బీఆర్ఎస్‌లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) బకాయిల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్‌దే అని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు చెల్లించలేదని అడిగారు. నాలుగేళ్లు పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇప్పుడు ప్రభుత్వంపై భారం పెరిగింది. పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ బీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లోని దుర్గం చెరువు మీదున్న కేబుల్ బ్రిడ్జి తప్ప.. కొత్తగా రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని చెప్పారు. అధికారం కోల్పోయేసరికి కేటీఆర్(KTR) తట్టుకోలేకపోతున్నారు. ఆయన మాట్లాడే భాష, సంస్కృతి బాగోలేదు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై వ్యక్తిగత దూషణలు సరికాదు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓడిపోతామనే సంకేతాలు రావడంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు.






