- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయితీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల హాట్ కామెంట్స్
తెలంగాణలో రాజకీయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఆమె మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఆమె మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. మరోవైపు (Congress) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తను కాంగ్రెస్‌తో మాట్లాడింది 2013లో అని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, బీఆర్ఎస్‌లో నాకు ఒకే ఒక్క నాయకుడు (KCR) కేసీఆర్.. నాకు ఇంకెవరు నాయకులు లేరని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత తీరుపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) హాట్ కామెంట్స్ చేశారు.
గురువారం హదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) మీడియాతో మాట్లాడుతూ.. అడ్డగోలుగా సంపాదించుకుని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయితీ నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మీద విమర్శలు చేసే స్థాయి మీది కాదని కవితను విమర్శించారు. మీ తగాదాలు కాంగ్రెస్ మీద స్పందించడం మానుకోండి.. మధ్యవర్తిని పెట్టుకొని తగాదాలు పరిష్కరించుకోండని ఆయన సూచించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత చెబుతున్నారని ఆరోపించారు. రెండు పార్టీలు ఒకటే అనేది గత ఎన్నికల్లో రుజువు అయ్యిందని, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాలు దిగజారిపోయి.. ఆస్తి తగాదాలను కూడా రాజకీయం చేసుకుంటున్నారని విమర్శలు చేశారు. ఆస్తుల కోసమా.. లేక పదవి కోసమో సొంత కుటుంబంపైన కొట్లాడే వాళ్ళు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు.. అని అనిరుధ్ రెడ్డి నిలదీశారు.






