- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ MLA సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన.. ఇంకా అందుబాటులోకి రాని కోమటిరెడ్డి, ప్రేమ్ సాగర్!
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) అలకవీడారు. ఐఏసీసీ(AICC) ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) బుజ్జగింపులతో కూల్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) అలకవీడారు. ఐఏసీసీ(AICC) ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) బుజ్జగింపులతో కూల్ అయ్యారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ ఎదుట ప్రకటించారు. మీ సేవలను పార్టీ గుర్తిస్తుందని.. తప్పకుండా అవకాశం లభిస్తుందని మీనాక్షి నటరాజన్‌కు సుదర్శన్ రెడ్డికి భరోసా ఇచ్చారు. కాగా, మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కుతుందని సుందర్శన్ రెడ్డి ఆశించారు. కాంగ్రెస్ వర్గాల్లోనూ ఆ మేరకు చివరి వరకు చర్చ జరిగింది. అయితే, చివరి నిమిషంలో కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించింది.
దీంతో సుందర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. సుదర్శన్ రెడ్డి నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్‌లు వెళ్లారు. తాజాగా వీరి బుజ్జగింపులు ఫలించాయి. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వారు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.






