తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. మంత్రి పదవి కోసం సీనియర్ నేత కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion)కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చేనెల​3వ తేదీన కేబినెట్ విస్తరణ జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. మంత్రి పదవి కోసం సీనియర్ నేత కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion)కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చేనెల​3వ తేదీన కేబినెట్ విస్తరణ జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్​వర్మ(Governor Jishnu Dev Varma)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ గురించి అధికారికంగా సీఎం రేవంత్ గవర్నర్‌కు సమాచారం ఇచ్చారు. వచ్చేనెల 3వ తేదీ నాడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది.

ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఆ పార్టీ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy) సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)లకు లేఖ రాశారు. కేబినెట్‌లో రంగారెడ్డి నేతలకు అవకాశం ఇవ్వాలని వినతిలో పేర్కొన్నారు. అంతేకాదు. రేపు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని స్వయంగా కలవనున్నట్లు వార్తలు విపిస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరారు. రేపు బీసీ రిజర్వేషన్‌(BC Reservation)పై జంతర్ మంతర్‌లో ధర్నా ఉండటంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud), కొండా సురేఖ(Konda Surekha), బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీకి చేరుకున్నారు.

Next Story