- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్‌పై వ్యాఖ్యలు చేయడానికి నీకెంత ధైర్యం.. కేటీఆర్‌పై కాంగ్రెస్ MLA ఫైర్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం మధ్యాహ్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడానికి కేటీఆర్‌కు ఎంత ధైర్యం అని సీరియస్ అయ్యారు. కేటీఆర్ మీద తమ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. ఎక్కడైనా మిమ్మల్ని వెంటపడి తరిమితే మాకు సంబంధం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్‌కు పదేళ్లు అధికారం ఇస్తే.. దోచుకోవడం, దాచుకోవడం అనే విధంగా పాలించి.. ఇప్పుడు నీతులు చెబుతున్నారా? అని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తాము గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని.. దానిని కూడా గులాబీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
కాగా, ఈ ఉదయం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడటం సిగ్గుచేటు. దివాళా తీసింది రాష్ట్రం కాదు.. మీరు, మీ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం.. భరిస్తాం. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదు.. నాలుక చీరేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు.






