- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ రెడ్డిది మంచి మనసు: ఎమ్మెల్యే
ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం, మంత్రులు, కార్మిక సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీఎం మానవీయ కోణంతో ఆలోచించారని, కార్మికులకు అండగా ఉంటామనే గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారని అన్నారు. ఆర్టీసీ కార్మికులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని కొందరు చూశారని, గతంలో ఆర్టీసీ యూనియన్‌కి గౌరవ అధ్యక్షుడుగా పనిచేసిన వాళ్ళు కార్మికులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ కు హక్కు లేదని, గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హాయాంలో ఆర్టీసీ కార్మిక సంఘాలను రద్దు చేశారు. యూనియన్ నేతలను సస్పెండ్ చేశారని విమర్శించారు. తమది మానవీయ పాలన, బీఆర్ఎస్ ది నియంత పాలన అని, కార్మికులు ఎప్పటికీ బీఆర్ఎస్ ను నమ్మరని కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. మంచి మనసుతో సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నారన్నారు.






