- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్ల ఎలా కడతారో మేమూ చూస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక
బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Medipally Sathyam) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Medipally Sathyam) కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును ఎలా కడతారో మేమూ చూస్తాం.. ఆపే దమ్ము మాకుందని అన్నారు. కావాలనే బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా హరీష్ రావు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యలను బూచీగా చూపి రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని మేడిపల్లి సత్యం మండిపడ్డారు. అసలు కేటీఆర్, లోకేష్ మధ్య రహస్య భేటీ ఎందుకు జరిగింది.. ఏ అంశంపై వీరి మధ్య చర్చ జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలియాలని అన్నారు. కేటీఆర్ స్పందించి సమాధానం చెప్పాలని మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. వీరి రహస్య సమావేశం తర్వాతనే.. పదే పదే లోకేష్‌ను తమ్మూడు అని కేటీఆర్ సంబోధిస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్‌తో లోపల మంతనాలు చేయడం, పైకి విమర్శలు చేస్తున్నట్లు యాక్టింగ్ చేయడం కేటీఆర్‌కు అలవాటే అని అన్నారు.






