- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశంసించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశంసించారు. మంగళవారం అసెంబ్లీ సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. దీనికి రైతుల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చరణ్ సింగ్‌ను ఛాంపియన్ ఆఫ్ ది ఫార్మర్స్ అంటారని, రైతుబంధు ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అయ్యారని అన్నారు. కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో వేయడం సాహసోపేతమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం 18 నెలల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా రైతుల కోసం కాంగ్రెస్ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజులు ఇవన్నారు. గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ కూడా సరిగా చేయలేక పోయిందని, కేసీఆర్ రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని విమర్శించారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి రైతన్నలకు అండగా నిలుస్తున్నారని, రైతు భరోసాతో ప్రతిపక్ష నాయకులకు నిద్ర లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్ష నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయిందని, ఒక నాయకుడైతే జ్వరంతో ఆస్పత్రిలో చేరారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.






