- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజారుద్దీన్‌కి ఇస్తే ఇబ్బంది లేదు.. నేను మంత్రి పదవి రేసులో ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో ఆశావహుల పోటి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి పదవి (Ministerial post) కోసం తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశావహుల పోటి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్, పార్టీ సీనియర్ నేత (Azharuddin) అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే ఆయనను కేబినెట్‌లోకి తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. దీంతో మంత్రి పదవి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే మంత్రి పదవి కావాలంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను కూడా మంత్రి పదవి రేసులో ఇంకా ఉన్నానంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) కుండబద్దలు కొట్టారు.
ఆదివారం ఆయన అసెంబ్లీ అవరణంలో మీడియా చిట్ చాట్‌లో హాట్ కామెంట్స్ చేశారు. నేను మంత్రి పదవి రేసులో ఇంకా ఉన్నా అని తన మనసులో మరోసారి చెప్పారు. మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు ఇస్తే నాకు ఇబ్బంది లేదు.. కానీ, జూబ్లీహిల్స్ టికెట్ బీసీ నేతకు ఇవ్వాలని చెప్పుకొచ్చారు. కాగా, గతంలోనూ మంత్రి పదవిపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పదవుల విషయంలో నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఓర్చుకుంటూ ఇంకా పార్టీ లైన్‌లోనే ఉన్నానని అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేసేందుకు వారి డిమాండ్ మేరకు మంత్రి పదవి అడుగుతున్నా తప్పా పదవీ వ్యామోహం తో కాదన్నారు.






