CM రేవంత్ రాత్రి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫుల్ హ్యాపీ

by Gantepaka Srikanth |

మంత్రివర్గంలో స్థానం దక్కడంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) స్పందించారు.

CM రేవంత్ రాత్రి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫుల్ హ్యాపీ
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రివర్గంలో స్థానం దక్కడంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) స్పందించారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజు అని అన్నారు. రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆ గుడ్ న్యూస్‌తో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. 11 గంటలకు రాజ్‌భవన్‌కు రావాలని చెప్పారు. నా లాంటి సామాన్య కార్యకర్తకు కేబినెట్‌లో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు. మాదిగ సామాజికవర్గం తరపున కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. అడ్లూరితో పాటు బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్‌ (మాల)కు అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.00 - 12.20 గంటల మధ్య ప్రమాణస్వీకారం జరగనుంది. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.




Next Story