Congress MLA : కేసీఆర్ తో పార్టీ మారిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ.. అసెంబ్లీలో అనూహ్య పరిణామం

by Prasad Jukanti |

అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

Congress MLA : కేసీఆర్ తో పార్టీ మారిన ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి భేటీ..  అసెంబ్లీలో అనూహ్య పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇవాళ కేసీఆర్ తో (KCR) భేటీ అయ్యారు. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు (Budget Session) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ చాంబర్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే కొంత కాలంగా గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారనే ప్రచారం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అయింది.

రూట్ క్లియరెన్స్ కోసమేనా?:

శుభకార్యానికి ఆహ్వానించేందుకు కేసీఆర్ ను మహిపాల్ రెడ్డి కలిసినప్పటికీ ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాక పటాన్ చెరు పాలిటిక్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. తన అనుచరులనే మహిపాల్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే తీరుతో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని కాటా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై సైతం కాంగ్రెస్ శ్రేణలు ఎటాక్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం ఫోకస్ పెట్టింది. ఇంతలో ఇటీవల కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ క్రమంలో ఇక ఆయన కాంగ్రెస్ (Congress) ను వీడి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ విషయంలో రూట్ క్లియర్ చేసుకునేందుకు తన తమ్ముడి కుమారుడి శుభలేఖను తానే స్వయంగా కేసీఆర్ ను కలిసి అందజేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ భేటీ శుభకార్యం వరకే పరిమితం అవుతుందా లేక రాజకీయంగా ఎదైనా కొత్త టర్న్ గా మారుతుందా అనేది వేచి చూడాలి.

Next Story