ఫామ్‌హౌజ్‌లో కవితకు ఎంట్రీ లేదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-23 16:48:57  IST  )

బీఆర్ఎస్(BRS) కొన్ని దయ్యాలు ఉన్నాయని.. వాళ్లే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు.

ఫామ్‌హౌజ్‌లో కవితకు ఎంట్రీ లేదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) కొన్ని దయ్యాలు ఉన్నాయని.. వాళ్లే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) స్పందించారు. బీఆర్ఎస్‌పై కుట్ర చేస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు. అంత పెద్ద కుట్ర జరుగుతుంటే.. నేరుగా తండ్రిని కలిసి విషయం చెప్పకుండా.. ఇలా లేఖలు రాసుకోవడం లేంటి? అని అడిగారు. అసలు ఫామ్‌హౌజ్‌లో కవితకు ఎంట్రీ ఉందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ దేవుడు అయితే.. ఆ దెయ్యం ఎవరో కూడా చెప్పాలని అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడలేదు.. కుటుంబం మిమ్మల్ని దూరం పెట్టిందా? అని కవితను ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కనీసం ఎయిర్‌పోర్ట్‌లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎవరూ రాలేదు.. అక్కడకు వచ్చిన వాళ్లంగా జాగృతి నేతలే అని అన్నారు.

అంతకుముందు కవిత మాట్లాడుతూ.. ఆ లేఖ ఇప్పుడు రాసింది కాదని.. రెండు వారాల క్రితమే రాసినట్లు చెప్పారు. ఇప్పుడే కాదు.. ఇలా చాలాసార్లు లేఖ ద్వారా పార్టీలో జరుగుతున్న విషయాలను అధినేత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఇన్నాళ్లు లేనిది.. ఇప్పుడే తాను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది. దీని వెనుక ఎవరున్నారు? అనేది తెలియాల్సి ఉందని కవిత అన్నారు.

Next Story