- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరకు నువ్వు బీజేపీ ఆస్థాన జ్యోతిష్యుడిగా మిగిలిపోవడం ఖాయం.. ఏలేటిపై అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి రాజకీయాలు వదిలేసి జ్యోతిష్యం చెప్పుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి రాజకీయాలు వదిలేసి జ్యోతిష్యం చెప్పుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విడుదుల చేసిన ప్రెస్నోట్లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు నెలలకోసారి మహేశ్వర్ రెడ్డి ఊకదంపుడు సోది, ఊహకు అందని స్టోరీలు అల్లుతున్నాడని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డికి ఆయన కూర్చున్న నాంపల్లి బీజేపీ ఆఫీస్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. సహచర ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో కొనసాగుతాడా లేదో మహేశ్వర్ రెడ్డికి తన చిలుక జ్యోతిష్యం చూసి చెప్పాలని ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డికి జ్యోతిష్యంపై అంత పట్టు ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో? చెప్పాలన్నారు.
పార్టీ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ బీజేపీలో అరడజను మంది నాయకులు కత్తులు దూసుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకరి వెనుక మరొకరు గొతులు తీసుకుంటున్నారని, అధిష్టానం దగ్గర ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి మాత్రం అమాయకంగా హైదరాబాద్‌లో కూర్చుని సీఎం సీటు గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ విషయాలపై ఆయన శ్రద్ధ తగ్గించి బీజేపీలో ఏం జరుగుతుందో? తెలుసుకుంటే ఆ పార్టీలో ఆయన భవిష్యత్తు బాగుంటుందన్నారు. మహేశ్వర్ రెడ్డి మాటల్లో సీఎం రేవంత్ రెడ్డిపై అక్కసు తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి పైన ఈర్ష, ద్వేషంతో ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి కట్టు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తీరు మహేశ్వర్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏదో విధంగా మీడియాలో ఉండాలని నోటికొచ్చిన కథలు చెబుతున్నాడన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే మహేశ్వర్ రెడ్డి గౌరవం పెరుగుతుందన్నారు. లేదంటే ఆయన భారతీయ జనతా పార్టీ ఆస్థాన జ్యోతిష్యుడిగా మిగిలి పోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.






